Anandamu Prabhu Naakosagenu || Hebron Song ||

by Agastin a
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను 
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను          ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి 
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను       ||ఆనందము||

అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె 
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్        ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ 
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్     ||ఆనందము||
PRAISE THE LORD
-అగస్టీన్
Subscribe to Channel:
https://www.youtube.com/channel/UCk8gsg1HP5isl1mS9dQ90Dw
Follow on Facebook:
https://www.facebook.com/Agastin-a-1795027364138910/